ఒక అమ్మాయి వ్యధ,
నా స్నేహితురాలు జాను ది ప్రేమ వివాహం.
ప్రాణం కంటే ఎక్కువ గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు., ఇద్దరు పిల్లలకు జన్మ నిచ్చారు.
హాయిగా సాగిపోతున్నది వాళ్ళ జీవితం, కొన్ని సంవత్సరాలకు ఒక మిత్రుడు పరిచయం అయి, జాను భర్త లో చాలా మార్పులు తెచ్చినది,
చాలా దూరం పెరిగింది ఇద్దరి మధ్య, అన్నెళ్ళల్లో లేనిది వారి మధ్య గొడవలు మొదలయ్యాయి,
ఆ అబ్బాయి అంటే ఒక ప్రత్యేక మైన స్థానం ఇస్తూ వచ్చాడు మన హీరో.
జాను కు చెప్పలేని దుఃఖం,
అనలేదు అనుభవించలేదు.
ఆ మిత్రుడు ఎంత ప్రాణం అయిపోయాడంటే, జాను అంటే అసహ్యం, కోపం, ఇంకా ఏదో ద్వేషం మొదలయ్యేంత.
మిత్రుడి గొప్పతనం మనకు తెలీదు, అయితే జాను భర్త చాలా మంచివాడు, శ్రీ రాముడే అని చెప్తుంది తను.
నిజంగా అంత గొప్ప వాడో కాదో మనకైతే తెలీదు కానీ, ఒక ఆ స్నేహితుడి విషయం లో తప్ప వేరే ఏ ఇబ్బందీ లేదు ఆ జంట కు.
దాపరికం లేని వారి మధ్య ఎన్నో గోడలు కట్టుకునే స్థాయికి ఎదిగారు.
నలుగురికి ఆదర్శం అయిన జంట - ఇలా మాత్రం ఉండకూడదు అనే లా తయారయ్యారు.
ఏమిటిది, ఒక మిత్రుడి కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారా అని అనిపించింది నాకు.
జాను తన cousin రమ ki ఫోన్ చేసి తను చనిపోతున్నా అని చెప్పింది,
ఏమి చెప్పాలో తెలియని రమ నిజంగా నువ్వు చెప్పేది మీ ఆయన గురించా, అయిన ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి తో స్నేహం చేస్తే నీకు ఏమిటి ఇబ్బంది అని అడిగింది.
అందరూ మొదటిగా అడిగే ప్రశ్న ఇదే,
కానీ జాను స్థానం లో ఉంటే తెలుస్తుంది తన బాధ.
ఆ అబ్బాయి కోసం జాను నీ ఎన్నో మాటలు, ఒకసారి జాను చనిపోవాలని అనుకుంది, పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయింది.
ఫోన్ లో అంతా తన మిత్రుడి ఫొటోస్ , మొబైల్ గ్యాలరీ కి lock,
అదేంటి అని జాను అడిగితే, automatic ga padindi ani చెప్పాడు,
కానీ ఏదో search చేస్తునపుడు "How to lock galelry" ani search history lo undi.
జాను కు ఒక్కసారిగా నోట మాట రాలేదు,
తన భర్త 10 సంవత్సరాల లో ఎప్పుడు ఒక అబద్దం కూడా చెప్పలేదు, అలాంటిది ఇప్పుడు తన కోసం స్టార్ట్ చేసాడు.
తన మిత్రుడి తో మాట్లాడటం, call log delete చేయటం.
చాలా సార్లు చెప్పింది జాను, వద్దండీ ఓపెన్ గా ఉందాం, మీ ఇష్టం తన తో హ్యాపీ గా ఉండండి, but delete చేయకండి నాకు అది చాలా బాధేస్తుంది.
మచ్చ లేని చందమామ మీరు, ఇలా చేయటం నాకు నచ్చట్లేదు,
మీ గొప్పతనం విలువ మీరే తగ్గించుకోకండి అని బ్రతిమాలు కుంది.
వింటే గా, తన కాల్ వస్తె పక్కకు వెళ్ళిపోవటం,
తన మెసేజ్ వస్తె ముఖం లో ఏదో తెలియని ఆనందం తన్మయత్వం.
ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి నీ ఇంత లా అభిమానించడం ఎంటి అని,
వంద శాతం తను అబ్బాయి , అమ్మాయి అనే అవకాశమే లేదు.
కానీ ఎందుకో ఈతనికి తన మీద అంత ప్రాణం.
భార్య భర్త గొడవలు పిల్లల ముందే మొదలయ్యాయి,
చిన్నారులు ఇవి సహించలేక ఏడుస్తూ వెళ్ళిపోయేవారు.


