సమయం అర్ధరాత్రి 2 కావొస్తుంది, చలికాలం మొదలయి అప్పటికే నెల గడిచిపోయింది. చల్లటి రాత్రివేళ కుటుంబ సభ్యులతో కలిసి ఆరుబయట మంచం వేసుకుని నిద్రిస్తున్నాడు కైలాష్. 23 సంవత్సరాలు నిండి, మంచి వయసులో కోరికలతో వేడెక్కి ఉన్నాడు కైలాష్.
ఆ చలికి ఎవరైనా తనను వెచ్చగా హత్తుకుని పడుకుంటే బాగుండేది అని అతని మనసు రోజు గోల పెడుతుంది.
వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఒక నిర్మానుష్య ప్రాంతం ఉంది. అక్కడికి ఎవరూ ఒంటరిగా వెళ్లరు. వెళ్తే తిరిగి రారు.
ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో ఒక పెద్ద రైల్వే ట్రాక్ ఉంది. దానికి దగ్గరగా ఉండే లేబర్ క్వార్టర్స్ ఎప్పుడు జనాలతో సందడిగా ఉండేది. కానీ ఆరు నెలల క్రితం కొత్తగా పెళ్లి అయ్యి వచ్చిన ఒక అమ్మాయి కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకోవడంతో అక్కడ ఎదో పుకారు పొగలా పాకింది.
అక్కడి జనాల్లో అలజడి మొదలు అయింది. తర్వాత అది భయంగా మారింది. కొద్ది రోజుల్లోనే అ లేబర్ క్వార్టర్స్ అన్ని ఖాళీ అయ్యి ఆ క్వార్టర్స్ కాస్త దెయ్యాల కోటగా పేరు తెచ్చుకుంది.
కడుపు నిండా నీళ్లు తాగిన కైలాష్ కి, చలిగాలి ప్రభావం తో అవి లోపల ఉండలేకపోతున్నాయి. నిద్ర కళ్ళతోనే చిన్నగా లేచి తన బ్లాడర్ లో నిండిన వాటర్ ని బయటకు వదలడానికి కొంచెం దూరంగా ఉన్న పొదల చాటుకి వెళ్లి చిన్నగా ప్యాంటు జిప్ తీశాడు.
అప్పటిదాకా కీచురాళ్ళ శబ్దాలు, కుక్కల అరుపులు, కప్పల బెకబెకలు ఆ చీకటిలో అతనికి కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి. ఎందుకో సడన్గా తన చుట్టూ నిశ్శబ్దం ఆవహించింది.
అంతలోనే హఠాత్తుగా నేల మీద రాలిన ఎండుటాకులు ఒక్కసారిగా వీచిన పెనుగాలికి పెద్దగా శబ్దం చేస్తూ అతని వైపు రా సాగాయి. నిద్రమత్తులో తూగుతున్న అతని శరీరానికి ఆ చల్లటి గాలి ఒక్కసారిగా తాకగానే మత్తు వీడి చుట్టూ చూసాయి అతని కళ్ళు .
అతనికి దూరంగా ఒక్క తెల్లటి ఆకారం అతని వైపు వేగంగా వస్తున్నట్లు అనిపించి కళ్ళు నులుపుకుంటూ అటు చూశాడు. గాలి వేగం తో పాటుగా ఆ తెల్లని ఆకారం అతని వైపు రావడం చూడగానే అతని గుండె ఆగినట్టుగా అనిపించింది.
ఓపెన్ చేసిన జిప్పుని భయంతో క్లోజ్ చేసి, ఇది కలా నిజమా అనుకుంటూ అతనికి దగ్గరగా వస్తున్న ఆకారాన్ని కళ్ళు పెద్దవి చేసి మళ్ళి చూశాడు. నల్లటి పొడవాటి జుట్టు విరబోసుకుని అతని వైపు వేగంగా వస్తుంది ఆ తెల్లటి ఆకారం.
దెబ్బకి జడుసుకుని ద. . ద ..దయ్యం అని గట్టిగా అరుస్తున్న అతని మాటలు ఎవరో మంత్రం వేసినట్టు గొంతులోనే ఆగిపోవడం గమనించి అతని శరీరం భయంతో చల్లబడిపోయింది. కాళ్ళు, చేతుల్లో సన్నగా వణుకు మొదలైంది. కింద ప్యాంటు తడిసిపోవడం కూడా తెలియలేదు అతనికి.
గట్టిగా అరవాలి అనిపిస్తుంది కానీ గొంతులో నుంచి మాట బయటకు రావడం లేదు కైలాష్ కి. ఆ ఆకారం తనకి కొద్ది దూరంలో ఉందని గ్రహించి ఇంక కాళ్ళకి పని చెప్పి పరుగుపరుగున వచ్చి తన మంచం మీద పడి నిండుగా దుప్పటి కప్పేసాడు ఆకాష్.
ఎప్పుడూ లేనంతగా హోరుగాలి అతని మంచాన్ని చుట్టి దుప్పటిని గట్టిగ కొడుతుంది, దుప్పటి ఎగిరిపోకుండా గట్టిగా చేతితో పట్టుకున్నాడు కైలాష్. దుప్పటిలో అతని శరీరం చలికి కాకుండా భయంతో గజగజ వణుకుతోంది.
ఆ ఆకారం ఎక్కడ తన దుప్పట్లో దూరుతుందో అని అతని కళ్లు అటు ఇటు వెతుకుతున్నాయి. గొంతు తడి ఆరిపోతుంది. బయట ఉన్న స్ట్రీట్ లైట్స్ కాంతి లో ఏదో ఆకారం తన వైపుగా వస్తుంది అని గమనించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు కైలాష్.
ఆ తెల్లటి ఆకారం ఆలా ఆలా కదిలి అతని మంచం దగ్గరికి వచ్చి ఆగింది అని, సన్నటి దుప్పటి పొరలలో నుంచి గమనిస్తున్న అతనికి అర్ధం అయింది. దుప్పటిని బలంగా పట్టుకున్న అతని చేతులను ఎదో ఒక బరువైన చేయి విడదీయడానికి ప్రయత్నిస్తుంది. ఆ చేతికి పోటీగా దుప్పటిని ఇంకా బలంగా పట్టుకుని తన వైపుగా లాకుంటున్నాడు కైలాష్.
ఉన్నట్టుండి సడన్గా ఆ చేయి దుప్పటిని లాగడం ఆపేసింది. భయం భయం సగం కళ్ళు తెరిచి చూసాడు కైలాష్. ఆ ఆకారం తనకు దగ్గరగా ఉంది అని గ్రహించాడు.
ఇప్పుడు ఆకారం ఇంకా ముందుకు జరిగి “ఏయ్.., నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా? నీకు చాలా చెప్పాలి. నీతో ఆడుకోవాలి? నా ఆకలి తీరాలి, ఒక్కసారి ఆ దుప్పటి తీసి నాతో రావా?" అంటూ గంభీరంగా అడుగుతుంది ఆ ఆకారం.
భయం తో సగం సచినట్లు అయిపొయింది కైలాష్ కి. ఇంకా గట్టిగా కళ్ళు మూసుకొని, అమ్మ....నాన్న అంటూ కేకలు వేయడం మొదలు పెట్టాడు. ఒక్కసారిగా చుట్టూ లైట్స్ వెలిగినట్లు గమనించాడు.
"అరే ..బాబు..!!ఏమయిందిరా!?" అంటూ వాళ్ళ అమ్మ సరస్వతి గొంతు వినపడగానే , దుప్పటిని ఒక్కసారిగా తీసి పడేసి, ఆమెను గట్టిగా కౌగలించుకొని ఏడవడం మొదలు పెట్టాడు కైలాష్.
అతని శరీరం వణికిపోవడం గమనించి కంగారు పడింది సరస్వతి. "ఏమైంది రా?" అని ప్రశ్నిస్తున్న వాళ్ళ అమ్మకు సమాధానం చెప్పకుండా, భయం భయంగా చుట్టూ చూశాడు. అతనికి దూరంగా కొబ్బరి చెట్టు కింద నిల్చొని అతనినే గమనిస్తూ. .చిన్నగా చీకట్లో కలిసిపోయింది ఆ తెల్లటి రూపం.
అది మాయం అవ్వగానే కైలాస్ వాళ్ళ అమ్మ సరస్వతిని గట్టిగా కౌగలించుకొని, భయంతో ఆమెను వదిలి పెట్టడం లేదు. నెమ్మదిగా కళ్ళు మూసుకున్న అతని కళ్ళ ముందు గతం కదిలింది.
రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న లేబర్ క్వార్టర్స్ లో ఒక ఇంటికి కొత్త పెళ్లికూతురుగా వచ్చింది అప్సర. నిండా 18 సంవత్సరాలు కూడా ఉన్నాయో? లేదో? కానీ మహా అందగత్తె అప్సర. కలువ రేకుల లాంటి కళ్ళు, హిమాలయాలను తలపించే యద ఎత్తులు, నయాగరా జలపాతం లాంటి సన్నని నడుము, చిలక ముక్కు, దబ్బపండు లాంటి బుగ్గలు చెర్రీ పళ్ళ లాంటి పెదవులు,.. చూడగానే ఆకలి వేసే రూపం ఆమెది.
కాముడు సైతం ఆమెతో కామకేళి సాగించాలి అనుకునే అప్సర, దున్నపోతులకి రారాజు లాగా ఉండే నల్ల రాజుకి భార్యగా రావడానికి ఎలా ఒప్పుకుందో అర్ధం కాలేదు కైలాష్ కి.
కానీ ఆమెని చూడగానే ఏదో ఒకరోజు తన ఆకలి తీర్చుకోవాలి అని మనసులో బలంగా అనుకున్నాడు కైలాష్.
అప్సర వచ్చిన మొదటి రోజు నుంచి కైలాష్ కి ఒక్కటే డ్యూటీ అయిపోయింది. ఎలాగైనా ఆమె కంట్లో పడాలి, తనతో స్నేహం చేయాలి, ఎదో ఒకరోజు అప్సరని కసిగా అనుభవించాలి అని.
లేబర్ క్వార్టర్స్ లో కింద ఫ్లాట్ లోనే ఉండేది రాజు, అప్సర ల ఫ్యామిలీ. ఇంట్లో ఇద్దరే ఉండేవారు. కానీ రోజు రాత్రి అవగానే ఆ ఫ్లాట్ లో నుంచి ఆర్తనాదాలు, ఏడుపులు వినిపించేవి కైలాష్ కి.
పొద్దున పూట కూడా చాలా తక్కువగా బయటకి వచ్చేది అప్సర.ఆలా ఆమె వచ్చినప్పుడల్లా గోతికాడ నక్కలా వేచి ఉన్న కైలాష్, అతని బైక్ మీద బర్రున ఆమెకు ఎదురు వెళ్లడం ఆమె కంట్లో ఎలాగైనా పడాలి అని తాపత్రయ పడటం రోజు ఇదే జరిగేది.
అప్సర మాత్రం అవి ఏమి పట్టించుకోకుండా బయట తన పని తను చూసుకొని వెళ్లిపోయేది.
ఒక రోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నాడు కైలాష్. ఆమె బయటకు రాకపోతే ఇంట్లోకి వెళ్లి అయినా ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు.
చాలా సేపు ఎదురు చూసినా అప్సర బయటకు రాకపోయే సరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ చూసి, ఎవరు లేరు అని నిర్ణయించుకున్నాక, అప్సర ఇంటి తలుపు తట్టడానికి ప్రయత్నించాడు, డోర్ మీద చేయి పెట్టగానే అది బార్ర్ర్ర్ర్ర్ర్ మంటూ శబ్దం చేసుకుంటూ తలుపులు తెరచుకున్నాయి. మరల ఒకసారి అటు ఇటు చూసి చిన్నగా లోపలికి వెళ్లిన అతనికి కనపడిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు.
************


